భారత వాయుసేన చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం ముగిసింది. సుమారు 62 ఏళ్ల పాటు దేశ రక్షణలో కీలక పాత్ర పోషించిన చారిత్రాత్మక మిగ్-21 యుద్ధ విమానాలు సేవల నుంచి శాశ్వతంగా వైదొలిగాయి. ఈ సందర్భంగా చండీగఢ్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో ఈ రోజు అత్యంత భావోద్వేగపూరిత వాతావరణంలో వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. వాయుసేనాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ స్వయంగా మిగ్-21 విమానంలో చివరిసారిగా ప్రయాణించి ఈ శకానికి ముగింపు పలికారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa