తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టును పూర్తిగా స్వాధీనం చేసుకునే సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు మెట్రో ప్రాజెక్టులో 90 శాతం వాటా కలిగిన ఎల్ అండ్ టీ (L&T) కంపెనీ తమ వాటాను రాష్ట్ర ప్రభుత్వానికి విక్రయించడానికి సిద్దమయ్యింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా వెల్లడించారు.
మెట్రో రైలు ఫేజ్ -1లో ఎల్ అండ్ టీ కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో జరిగిన చర్చల్లో తమ వాటాను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయడానికి సన్నాహాలు జరుపుతున్నట్టు చెప్పారు. ఈ క్రమంలో మెట్రో సర్వీసుల నిర్వహణ పూర్తిగా ప్రభుత్వ శాసన సమర్థతలోకి వస్తుందని అంచనా.
హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు దీర్ఘకాలిక అభివృద్ధికి, ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి ఈ నిర్ణయం కీలకంగా భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రైవేట్ భాగస్వామ్యం ఉన్న మెట్రో ప్రాజెక్టు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వశంలోకి వచ్చినప్పుడు, మరింత సమర్థవంతమైన నిర్వహణకే దారి తీస్తుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఈ నిర్ణయం అమలులోకి వచ్చిన తరువాత, మెట్రో రైలు సౌకర్యాలు మరింత అభివృద్ధి చెందుతూ, నగర ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా సేవలను అందించగలదని అధికార వర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ మెట్రో ప్రాజెక్టులో పూర్తి హక్కులు రావడం ద్వారా మెట్రో కార్యాచరణలో మరింత పారదర్శకత, సమగ్రత వస్తుందని భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa