వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కలిసి తెలంగాణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని కోరినట్లు మంత్రి తెలిపారు. కేంద్రం నిర్ణయం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 100 వ్యవసాయ జిల్లాలను గుర్తించింది. ఇందులో తెలంగాణ నుంచి నారాయణపేట, గద్వాల, జనగామ, నాగర్ కర్నూల్ జిల్లాలు ఎంపికయ్యాయి.
ప్రధానమంత్రి ధన్–ధాన్య కృషి యోజనను కేంద్ర ప్రభుత్వం 2025-26 బడ్జెట్‌లో ప్రకటించింది. తక్కువ ఉత్పాదకత, ఏడాదిలో ఒకే పంట సాగు, సగటు కంటే తక్కువ రుణాల అందుబాటు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ వెనుకబడిన జిల్లాలను ఎంపిక చేశారు. ఎంపికైన ఈ నాలుగు జిల్లాలకు రూ. 960 కోట్ల వార్షిక వ్యయంతో ఆరేళ్ల పాటు ఈ పథకాన్ని అమలు చేయనున్నారు ఈ యోజన అనేది వ్యవసాయ రంగంలో ఉత్పాదకత పెంపు, పంటల మార్పిడి, మెరుగైన నీటిపారుదల, నిల్వ, ఉత్పత్తుల విలువ పెంచే ప్రాసెసింగ్ వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా చారిత్రక మార్పు తీసుకురానుంది.
పథకం ప్రధాన లక్ష్యాలు
వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం, పంటల వైవిధ్యీకరణను ప్రోత్సహించడం.
సుస్థిర వ్యవసాయ పద్ధతులను విస్తరించడం.
పంచాయతీ, బ్లాక్ స్థాయిలో పంట కోత అనంతరం నిల్వ సదుపాయాలను బలోపేతం చేయడం.
మైక్రో ఇరిగేషన్ వంటి నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించడం.
తక్కువ వడ్డీతో దీర్ఘకాలిక, స్వల్పకాలిక వ్యవసాయ రుణాలను సులభతరం చేయడం.
ఈ యోజన కేవలం ఒక పథకం మాత్రమే కాకుండా 11 మంత్రిత్వ శాఖలు, విభాగాల కింద అమలులో ఉన్న 36 కేంద్ర పథకాలను సమన్వయం చేస్తుంది. పీఎం కిసాన్, ఫసల్ బీమా యోజన, వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి, మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ వంటి పథకాలన్నీ ఇందులో భాగమవుతాయి. దీనికి రాష్ట్ర ప్రభుత్వ పథకాలను కూడా జోడించి, ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని వినియోగించుకోవడం ద్వారా రైతులు విస్తృతంగా లాభం పొందనున్నారు. జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన “జిల్లా ధన్–ధాన్య కృషి సమితి” ఏర్పాటై ప్రణాళికను సిద్ధం చేసి, అమలును పర్యవేక్షిస్తుంది. రాష్ట్ర స్థాయిలో ముఖ్య కార్యదర్శి అధ్యక్షతన “రాష్ట్ర ధన్–ధాన్య సమితి” ఏర్పాటవుతుంది. జిల్లా స్థాయిలో బేస్‌లైన్ సర్వే నిర్వహించి ఉత్పాదకత లోపాలు, మార్కెట్ మౌలిక సదుపాయాల కొరత వంటి అంశాలను విశ్లేషించిన తర్వాత వాటి ఆధారంగా ఐదేళ్ల ఫలితాల ఆధారిత కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసి అమలు చేస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa