రంగారెడ్డి జిల్లా కోకాపేటలో దారుణ హత్య కలకలం రేపింది. ఇద్దరు స్నేహితులు కలిసి మరో వ్యక్తిని కత్తులతో దాడి చేసి హతమార్చారు. కోకాపేటలో ముగ్గురు స్నేహితులు యాదగిరి, ఆఫ్రోజ్, నవాజ్ కలిసి ఫుల్‌గా మద్యం తాగారు. ఈ క్రమంలో చిన్న విషయంలో గొడవ తలెత్తింది. అది తారస్థాయికి చేరడంతో ఆఫ్రోజ్, నవాజ్ కలిసి యాదగిరిని కత్తులతో విచక్షణారహితంగా పొడిచారు. దీంతో యాదగిరి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa