TG: మందుబాబులకు షాక్ తగిలింది. అక్టోబర్ 2న గాంధీ జయంతి కావడంతో మద్యం షాపులు బంద్ చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తెలంగాణలో ప్రత్యేకంగా జరుపుకునే దసరా పండుగ కూడా అదే రోజు రావడంతో మందుబాబులు నిరాశకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని మద్యం షాపుల ముందు రెండు రోజుల ముందే స్టాక్ చేసుకోవాలని సూచిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు అక్టోబర్ 2న మాంసం విక్రయాలు నిషేధిస్తూ జీహెచ్‌ఎంసీ ఉత్వర్వులు జారీ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa