తెలంగాణలో రేపటి నుంచి రేషన్ షాపులు మూతపడనున్నట్లు తెలుస్తోంది. రేషన్ డీలర్ల సంఘం డిమాండ్లపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో డీలర్లు రేషన్ షాపులు బంద్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గడిచిన 5 నెలల్లో తమకు కమిషన్ అందడంలేదని డీలర్లు వాపోయారు. సోమవారం 33 జిల్లాల్లో కలెక్టర్లకు వారి డిమాండ్లపై వినతిపత్రాలను కూడా సమర్పించారు. డీలర్లకు కనీస గౌరవవేతనం, వారి కుటుంబాలకు హెల్త్ కార్డులు, దుకాణాల అద్దె చెల్లించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa