నల్గొండ పట్టణంలోని బండారి గార్డెన్ వేదికగా మంగళవారం నాడు కందిసేన కమిటీ ఆధ్వర్యంలో 2025 నవరాత్రి దాండియా మహోత్సవం ఘనంగా నిర్వహించబడింది. తొలిసారి నల్గొండకు ఈ రకమైన సాంస్కృతిక కార్యక్రమాన్ని పరిచయం చేయడం విశేషంగా మారింది. రంగుల దుస్తుల్లో యువత ఊపందుకొని ఉత్సాహంగా దాండియాలో పాల్గొన్నారు.
కలాత్మకతతో కూడిన ఈ కార్యక్రమంలో వివిధ ప్రదర్శనలు, పాటలు, నృత్యాలతో ప్రేక్షకులను అలరించారు. ఈ సందర్బంగా నవరాత్రుల పండుగ విశిష్టతను తెలియజేస్తూ, సంప్రదాయాలను ఆధునికతతో కలిపిన వినోదాన్ని ప్రజలకు అందించారు. కుటుంబ సమేతంగా వచ్చిన ప్రజలు ఈ వేడుకలో ఆనందంగా పాల్గొన్నారు.
కందిసేన కమిటీ తీసుకున్న ఈ వినూత్న ఆలోచనకు స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. అలాంటి కార్యక్రమాలు తరచూ నిర్వహిస్తే యువతకు సాంస్కృతిక విలువలు చేరువ అవుతాయని పలువురు అభిప్రాయపడారు. నల్గొండ ప్రజలు ప్రతీ ఏడాది ఇలాంటి దాండియా ఉత్సవాలను నిర్వహించాలని కోరారు.
ఈ వేడుకలో చెరుకుపల్లి సాయికుమార్, భైరగొని అభిరామ్ సహా పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. వారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, ప్రజలతో కలిసి ఆటపాటల్లో పాల్గొని ఉత్సాహాన్ని మరింత పెంచారు. ప్రజల స్పందనతో కందిసేన కమిటీ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa