ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల్లో మద్యం, డబ్బు సరపరాకు అడ్డుకట్టవేయడం కోసం.. అధికారులు రంగంలోకి దిగి.. ముమ్మర తనిఖీలు ప్రారంభించారు. పోలీసులు, ఆబ్కారీ అధికారులు నేషనల్, రాష్ట్ర, డిస్ట్రిక్ట్ రోడ్ల మీద వాహనాలను నిలిపి సోదాలు చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం రూల్స్ ప్రకారం.. ఒక వ్యక్తి కేవలం రూ.50 వేల నగదు మాత్రమే తీసుకెళ్లేందుకు అనమతిస్తిన్నారు. అంతకన్నా ఎక్కువ డబ్బు తీసుకెళ్తే.. ఆ మొత్తానికి సంబంధించి అధికారులకు సరైన పత్రాలు సమర్పిస్తేనే ఆ మొత్తాన్ని తీసుకెళ్లనిస్తారు. లేదంటే దాన్ని సీజ్ చేస్తారు.
అయితే బస్సులు, బైక్, కార్లు వంటి వాటిల్లో ప్రయాణించే వారు 50 వేల రూపాయల కన్నా ఎక్కువ నగదును తమతో తీసుకెళ్తే.. పోలీసులు ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకుంటారు. మరి మెట్రోలో కూడా ఈ నిబంధలను వర్తిస్తాయా.. అసలు ఇంతకు మెట్రలో ఎంత మొత్తం నగదు వెంట తీసుకెళ్లవచ్చో మీకు తెలుసా.. లేదా. అయితే ఇది చదవండి. లేదంటే.. ఆ తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. తాజాగా ఓ వ్యక్తికి ఇదే పరిస్థితి ఎదురయ్యింది.
భారీ నగదుతో బుధవారం నాడు జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ మెట్రో స్టేషన్‌కు వెళ్లిన ప్రయాణికుడికి చేదు అనుభవం ఎదురైంది. మెట్రో స్టేషన్‌లోకి ప్రవేశించిన వ్యక్తిని చెక్ చేస్తుండగా అతడి వద్ద 3.5 లక్షల నగదు ఉన్నట్లు తెలిసింది. దీంతో మెట్రో సిబ్బంది ఆ వ్యక్తిని మెట్రో రైలు ఎక్కడానికి అనుమతించలేదు. కారణం రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం.. ఒక వ్యక్తి వద్ద గరిష్ఠంగా రెండు లక్షల వరకు నగదు వెంట తీసుకెళ్లవచ్చు. అయితే సదరు వ్యక్తి వద్ద అంతకు మించి నగదు ఉండటంతో.. మెట్రో సిబ్బంది అతడిని అనుమతింలేదు. దీంతో ఆ వ్యక్తి వెనక్కి వెళ్లిపోయాడని అధికారులు తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఒకరి వద్ద 50 వేల రూపాయలకు మించి ఉండకూడదు. ఒకవేళ అత్యవసరం.. అంటే వైద్యం, కాలేజీ ఫీజులు, పెళ్లి, బిజినెస్ వంటి ముఖ్యమైన అవసరాలకు పెద్ద మొత్తంలో నగదు తీసుకెళ్లేవారు సరైన ఆధారాలు దగ్గర ఉంచుకుని ప్రయాణాలు చేయాలి. అధికారులు అడిగినట్లు వారికి ఆ పత్రాలను చూపాలి. తనిఖీల సమయంలో సరైన పత్రాలు సమర్పించకపోతే డబ్బు జప్తు చేస్తారు.. తర్వాత ఆధారాలు చూపితే జప్తు చేసిన డబ్బును తిరిగి ఇస్తారు. తక్కువ మొత్తంలో దొరికిన డబ్బును రెవెన్యూ అధికారుల వద్ద జమ చేస్తారు. ఒకవేళ ఎక్కువ మొత్తంలో ఉంటే.. ఆ డబ్బును కోర్టులో జమ చేస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa