పండగ సీజన్‌లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త అందించింది. ప్రయాణికుల సౌకర్యార్థం పలు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. తిరుపతి నుంచి సాయినగర్ షిర్డీకి, తిరుపతి నుంచి జల్నాకు ప్రత్యేక సర్వీసులు నడపనున్నారు. ఈ రైళ్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతాయి. చెన్నై - షాలిమార్, కన్యాకుమారి- హైదరాబాద్ మార్గాల్లో కూడా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారు. పండగ రద్దీని నియంత్రించేందుకు మొత్తం 470 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa