TG: ప్రియుడి ఇంటి ఎదుట నిరసన చేస్తున్న యువతి మృతి చెందింది. ఈ ఘటన గద్వాల(D) గట్టు(M) చిన్నోనిపల్లెలో జరిగింది. పాల్వంచకు చెందిన ప్రియాంక చిన్నోనిపల్లెకు చెందిన యువకుడితో ప్రేమలో పడింది. కొన్నాళ్ల పాటు ఇద్దరూ సంతోషంగానే ఉన్నారు. ఆ తర్వాత దూరం పెట్టడంతో భరించలేకపోయిన ప్రియాంక ఆ యువకుడి ఇంటికి వచ్చి పెళ్లి చేసుకోవాలని అడిగింది. దానికి ఆయన నిరాకరించడంతో ప్రియుడి ఇంటి ఎదుటే నిరసనకు దిగింది. ఏకంగా మూడు నెలల పాటు ప్రియాంక నిరసన చేసింది. శనివారం అనూహ్యంగా ప్రియుడి ఎదుట అనుమానాస్పదంగా మృతి చెందింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa