హైదరాబాద్‌లో రేబిస్ వ్యాధితో బాలుడి మృతి చెందాడు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం వావిలాల గ్రామం నుండి మైదం శ్రీనివాస్ అనే వ్యక్తి బతుకుదెరువు కోసం వచ్చి హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో స్థిరపడ్డారు. అయితే 2 నెలల క్రితం అతని కుమారుడు శ్రీ చరణ్ కుక్కకాటుకు గురయ్యాడు. 2 రోజుల క్రితం అస్వస్థతకు గురికాగా తార్నాకలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా రేబిస్ వ్యాధి మరణాలు పెరుగుతుండంతో ఆందోళన కలిగిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa