ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్, ఐపీఎస్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది, హోంగార్డ్స్ శ్రేయస్సు కోసం అవసరమైన వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్‌కు ఉలెన్ జాకెట్లు, టీ-షర్ట్లు, హోంగార్డ్స్‌కు రేయిన్ కోట్లు అందజేశారు. వాతావరణ మార్పులు, శ్రమతో కూడిన విధులను దృష్టిలో ఉంచుకుని ఈ వస్తువులను అందించినట్లు ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ (అడ్మిన్) పెద్దన్న, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాణా ప్రతాప్ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa