ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. సోమవారం రూరల్ మండలంలోని బండ గూడ గ్రామ శివారులో వాగు ఉప్పొంగడంతో మూడు ట్రాక్టర్లు బోల్తా పడ్డాయి. వాగు దాటుతుండగా ఒక్కసారిగా వరద ఉధృతి పెరగడంతో ఈ ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు, డ్రైవర్లు, కూలీలు వెంటనే అప్రమత్తమై సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa