పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ న్యూయార్క్‌లో జరిగే ఐక్యరాజ్యసమితి 80వ సర్వసభ్య సమావేశాలకు హాజరయ్యేందుకు అమెరికా వెళ్లారు. లోక్‌సభ సచివాలయం నిర్ణయం ప్రకారం, భారత్ నుంచి అనధికార ప్రతినిధులుగా 31 మంది ఎంపీలను ఈ సమావేశాలకు పంపనున్నారు. ఈ సమావేశాల్లో దేశ అభివృద్ధి, సమానత్వం, సామాజిక న్యాయం వంటి అంశాలపై చర్చించనున్నారు. ఎంపీ వంశీకృష్ణ వివిధ దేశాల ప్రతినిధులతో భేటీ అయి, ప్రపంచ స్థాయి అభివృద్ధి కార్యక్రమాలు, ఉపాధి, విద్య, పర్యావరణ సమస్యలు, అంతర్జాతీయ సహకారం వంటి అంశాలపై చర్చించనున్నారు. తెలంగాణకు ఈ గౌరవప్రదమైన వేదికపై ప్రాతినిధ్యం దక్కింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa