స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ జాన్సన్ నాయక్ మాట్లాడుతూ ప్రజల ఆశీస్సులు బీఆర్ఎస్ పార్టీకే ఉన్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని అన్నారు. దస్తురాబాద్ మండల కేంద్రంలో జరిగిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుదారులను గెలిపించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa