మామడ మండలం మొండిగుట్ట గ్రామానికి చెందిన 50 మంది బీజేపీ నాయకులు, ఇస్లవాత్ బాలాజీ (రిషి కుమార్), బాధవత్ రమేష్, ఉప్పరి భీమేశ్ ల ఆధ్వర్యంలో బుధవారం డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. దేశంలో ప్రజాస్వామ్య విలువలను కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాపాడుతుందని, ప్రజల అభివృద్ధి, సామాజిక న్యాయం కోసం ఎల్లప్పుడూ ముందుంటుందని శ్రీహరి రావు అన్నారు. యువత ఈ ఆలోచనలకు ఆకర్షితులవ్వడం సంతోషకరమని ఆయన పేర్కొన్నారు. పార్టీలో చేరిన నాయకులకు డీసీసీ అధ్యక్షులు కండువా కప్పి స్వాగతం పలికారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa