కరీంనగర్ జిల్లా కొత్తపెళ్లి మండలం రేకుర్తిలోని ఇందిరా నగర్ బుడగ జంగాల కాలనీలో గురువారం సుడా చైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ కాపీలను అందజేసి, పలు ఇళ్లకు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇల్లు అందేలా ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. స్థానిక సంస్థలలో కాంగ్రెస్ కు ఓటు వేసి గెలిపించాలని ఆయన తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa