బాచుపల్లిలోని ఓ అపార్ట్మెంట్ లో భారీ కొండచిలువ ఒకటి ప్రత్యక్షం కావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏకంగా రెండో అంతస్తులోని గదిలోకి కొండచిలువ దూరడం ఆ ఆపార్ట్మెంట్ వాసులను వణికించింది. వెంటనే పోలీసులకు, స్నేక్ సొసైటీ సభ్యులకు ఫోన్ చేసి సమాచారం అందించగా.. వారు వచ్చి కొండచిలువను జాగ్రత్తగా పట్టి తీసుకెళ్లారు. దానిని అటవీ ప్రాంతంలో వదిలేసినట్లు తర్వాత వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అపార్ట్మెంట్ వాసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాచుపల్లిలోని రెడ్డీస్ ల్యాబ్ సమీపంలోని ఓ అపార్ట్మెంట్ లో భారీ కొండచిలువ కనపించింది. రెండో అంతస్తులోని గదిలోకి దూరిన ఈ కొండచిలువను చూసి భయాందోళనలకు గురైన అపార్ట్మెంట్ వాసులు పోలీసులకు సమాచారం అందించారు. స్నేక్ సొసైటీ సభ్యులకు ఫోన్ చేయడంతో వారు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఆ భారీ కొండచిలువను జాగ్రత్తగా పట్టుకున్నారు. అయితే, ఆ కొండచిలువ అపార్ట్మెంట్ రెండో అంతస్తు వరకు ఎలా చేరిందనేది అంతుపట్టడంలేదని పోలీసులు, స్నేక్ సొసైటీ సభ్యులు చెబుతున్నారు. దీనిపై విచారణ జరుపుతామని పోలీసులు వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa