నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని రామాపూర్ గ్రామానికి చెందిన నిరంజన్ గౌడ్ సతీమణి నిర్మలగౌడ్, బీఆర్ఎస్ పార్టీ తరపున కొల్లాపూర్ జడ్పీటీసీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి కోరిక మేరకు ఆమె అభ్యర్థిత్వాన్ని అంగీకరించారు. ఈ నేపథ్యంలో, శనివారం నిర్మల నిరంజన్ గౌడ్, హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో రామాపూర్ గ్రామ బీఆర్ఎస్ నాయకులు కొమ్మ గోపాల్ యాదవ్ కూడా పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa