TG: బీసీ రిజర్వేషన్ల సాధనకు శనివారం నిర్వహించే బంద్‌లో అందరూ పాల్గొనాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ఖమ్మంలో శుక్రవారం మాట్లాడుతూ.. బీఆర్ఎస్ రిజర్వేషన్లను 50%కి పరిమితం చేసి బీసీ కోటాను తగ్గించిందన్నారు. తాము సైంటిఫిక్ సర్వే లెక్కల ప్రకారం 42% బిల్లును ఆమోదించి పంపినా కేంద్రం ఆమోదించడం లేదన్నారు. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ నైజం ఏంటో బయటపడిందన్నారు. వారిప్పుడు మాయమాటలు చెప్పినా ప్రజలు నమ్మరని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa