గత కొన్ని రోజులుగా కీలక మావోయిస్టు నేతలు లొంగిపోతున్నారు. ఇటీవల కీలక నేతలైన మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను, తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న అలియాస్ రూపేశ్లు పోలీసులు ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లొంగుబాట్లపై మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సంచలన లేఖ విడుదల చేసింది. అందులో మల్లోజుల, ఆశన్నను విప్లవ ద్రోహులుగా అభివర్ణించింది. శత్రవులు ఎదుట లొంగిపోయిన వారిద్దరికి తగిన శిక్ష ప్రజలే విధిస్తారని సంచలన వ్యాఖ్యలు చేసింది.
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) అధికార ప్రతినిధి అభయ్ పేరుతో నాలుగు పేజీల లేఖ విడుదల చేసింది. కేంద్ర కమిటీతో చర్చించకుండానే.. మల్లోజుల, ఆశన్న వారి అనుచరులతో కలిసి లొంగిపోయారని లేఖలో పేర్కొంది. వారిని విప్లవ ద్రోహులుగా, పార్టీ విచ్ఛిన్నకారులుగా, విప్లవ ప్రతిఘాతకులుగా అభివర్ణించింది. శత్రువులకు లొంగిపోయిన మల్లోజుల, ఆశన్న బృందాలను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు వెల్లడించింది. కాగా 2 రోజుల్లో 258 మంది లొంగిపోయారని అమిత్ షా ట్వీట్ చేసిన నేపథ్యంలో ఈ లేఖ కలకలం సృష్టిస్తోంది.
మల్లోజుల మారలేదు..
"2011 చివరి నుంచి విప్లవోద్యంమం గడ్డు స్థితిని ఎదుర్కొంటూ వస్తోంది. 2018లో మవోయిస్టు పార్టీ ఒకసారి తాత్కాలిక వెనుకంజ వేసింది. అప్పటి నుంచి మల్లోజుల బలహీనతలు బయటపడ్డాయి. 2020 కేంద్ర కమిటీ సమావేశంలో.. మల్లోజుల దండకారణ్య విప్లవాచరణలోని కొన్ని లోపాలపై.. సొంత విశ్లేషణలతో నిర్ధరించి ఒక పత్రాన్ని ప్రవేశపెట్టాడు. దాన్ని కేంద్ర కమిటీ తిరస్కరించింది. ఆ తర్వాత ఎప్పటికప్పుడూ జరిగిన కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరో.. ఆయన తప్పుడు రాజకీయ భావనలను పార్టీ విమర్శించింది. అనంతరం ఆయన్ను పార్టీ సరిదిద్దడానికి కృషి చేసింది. 2011లో జరిగిన దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ ప్లీనం.. మల్లోజుల వ్యక్తివాదాన్ని, అహంభావాన్ని, తీవ్రమైన పెద్దతందారీ తనాన్ని విమర్శించి వాటిని సరిదిద్దుకోవాలని కోరింది. అయితే, 2025 మే నెలలో జరిగిన ఆపరేషన్ కగార్ దాడిలో మా పార్టీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బసవరాజు అమరత్వం తర్వాత మల్లోజులలో దీర్ఘకాలంగా ఉన్న సైద్దాంతిక, రాజకీయ, నిర్మాణ బలహీనతలు గుణాత్మక మార్పును సంతరించుకుని శత్రువు ముందు మోకరిల్లేలా చేశాయి" అని అభయ్ లేఖలో పేర్కొన్నాప.
వారిని తన్ని తరిమేయండి..
"విప్లవానికి ద్రోహులుగా మారిన మల్లోజుల, ఆశన్నల ముఠా.. సరైన మార్గంలో విప్లవ ఉద్యమాన్ని పునర్మిస్తామనడం బూటకం. వాళ్లు కేంద్ర, రాష్ట్ర ఇంటజిజెన్స్ ఏజెన్సీల నియంత్రణలో ఉంటూ చేసే ప్రజా పోరాటాలు, నిర్మించే విప్లవ ఉద్యమం.. ప్రభుత్వ ప్రాయోజిత ప్రజా పోరాటాలుగా, విప్లవ ఉద్యమంగానే ఉంటాయి. అందుకే ఈ విప్లవ ద్రోహులు ప్రజాపోరాటాల పేరుతో ప్రజల వద్దకు వస్తే.. వారిని తన్నితరమాల్సిందిగా పిలుపునిస్తున్నాం. కరార్ యుద్ధంతో ప్రాణభీతి ఉన్నవారు ఎవరైనా.. లొంగిపోతే లొంగిపోవచ్చు కానీ.. పార్టీకి, విప్లవ ప్రజలను చెందిన ఆయుధాలను శత్రువుకు అప్పగించకూడదని కోరుతున్నాం. అది విప్లవ ద్రోహమే కాకుండా విప్లవ ప్రతిఘాతకత అవుతుంది. విప్లవ ప్రతిఘాతకులను.. విప్లవ ప్రజలు శిక్షించక తప్పదు" అని లేఖలో అభయ్ హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa