జూబ్లీహిల్స్ ఎన్నికల విజయం కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహాన్ని నింపింది. ఇదే ఊపుతో త్వరలో జరగనున్న రూరల్, అర్బన్ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సత్తా చాటాలని పార్టీ యోచిస్తోంది. మరోవైపు, జూబ్లీహిల్స్ ఓటమితో నిరాశలో కూరుకుపోయిన బీఆర్ఎస్ పార్టీకి ఈ ఎన్నికలు అగ్నిపరీక్షగా మారనున్నాయని ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జూబ్లీహిల్స్ ఫలితాల ప్రభావం స్థానిక ఎన్నికలపై ఉంటుందని, గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ నాయకులు, శ్రేణుల్లో స్థైర్యాన్ని నింపడం బీఆర్ఎస్ కు సవాలుగా మారుతుందని భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa