తెలుగు రాష్ట్రాల్లో చలి రోజురోజుకీ తీవ్రతరం అవుతోంది. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పడిపోతున్నాయి. ఏపీలోని అల్లూరి జిల్లా జి.మాడుగులలో కనిష్టంగా 6 డిగ్రీలు నమోదై, ఈ సీజన్‌లో అత్యల్ప ఉష్ణోగ్రతగా నిలిచింది. తెలంగాణలో కూడా ఇదే తరహా పరిస్థితి నెలకొంది. సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 7.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రాల్లో చలి మరింత పెరిగే అవకాశం ఉండటంతో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa