TG: కుటుంబ కలహాలతో ఐటీ ఉద్యోగి విశాల్ గౌడ్(28) ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ గాంధీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. టీసీఎస్‌లో ఉద్యోగం చేస్తున్న విశాల్ 2023లో నవ్యను వివాహం చేసుకున్నాడు. దంపతులు తరచూ గొడవపడటంతో అనేకసార్లు పంచాయితీలు జరిపినా ఘర్షణలు ఆగలేదు. ఈ ఏడాది మార్చిలో నవ్య పుట్టింటికి వెళ్లి తిరిగి రాలేదు. పైగా ఆమె ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కౌన్సెలింగ్, కేసుతో విశాల్ మనస్తాపానికి గురయ్యాడు. శుక్రవారం గదిలో ఉరేసుకుని మృతి చెందాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa