తెలంగాణలో తమ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్ల పాటు కొనసాగుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హిందూ సమాజంలాంటిదే కాంగ్రెస్ అని డీసీసీ అధ్యక్షులకు చెప్పానని, పార్టీ నేతగా ఎలా పనిచేయాలో వివరించే క్రమంలో ఈ వ్యాఖ్యలు చేశానని తెలిపారు. జూబ్లీహిల్స్లో డిపాజిట్ కోల్పోవడంతోనే బీజేపీ దీన్ని వివాదం చేస్తోందని ఆయన మండిపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa