జగిత్యాల పట్టణంలో ఇంటి బయట ఉంచిన వంట గ్యాస్ సిలిండర్లను దొంగిలిస్తున్న సమీర్ అనే నిందితుడిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. పట్టణ ప్రజల ఫిర్యాదుల మేరకు నిఘా పెట్టి, నిందితుడిని పట్టుకున్నట్లు డీఎస్పీ రఘు చందర్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సీఐ కరుణాకర్, ఎస్సైలు రవి, సుప్రియ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa