హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలో గురువారం ఇండిగో విమానం ఆలస్యం కావడంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఉదయం 7:45 గంటలకు పాట్నా వెళ్లాల్సిన విమానం ఇంకా బయల్దేరకపోవడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెల్లవారుజామున 5:30 గంటలకు విమానాశ్రయానికి చేరుకున్నామని, ఆలస్యం గురించి సమాచారం ఇవ్వలేదని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదని ప్రయాణికులు ఇండిగో సిబ్బందిని నిలదీశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa