ఉమ్మడి మెదక్ జిల్లాలో కొర్రమీను చేపల పెంపకం రైతులకు మంచి లాభాలను తెచ్చిపెడుతోంది. తక్కువ స్థలంలో, వ్యవసాయానికి అనుబంధంగా వీటిని పెంచుతున్నారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ రైతు రెండున్నర ఎకరాల పొలంలో కొర్రమీను చేపల పెంపకం చేపట్టి, గత 4 సంవత్సరాలుగా అధిక లాభాలు ఆర్జిస్తున్నాడు. 6 నెలలకు ఒకసారి పంట వస్తుందని, చేప పిల్లలను ఏపీ నుంచి తెప్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్‌కు సమీపంలోని సంగారెడ్డి, సదాశివపేట, జోగిపేట, పటాన్ చెర్, జహీరాబాద్ వంటి ప్రాంతాల్లో పెంపకం ఎక్కువగా జరుగుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa