రాజన్న సిరిసిల్ల జిల్లా, తంగళ్ళపల్లి మండలంలోని జిల్లెల్ల ఎక్స్ రోడ్ వద్ద శనివారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి అంబేద్కర్ యువజన సంఘ సభ్యులు, స్థానిక నాయకులు కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు అంబేద్కర్ సమానత్వం కోసం చేసిన పోరాటాన్ని స్మరించుకున్నారు. సమాజంలో అందరికి సమాన హక్కులు కల్పించాలని ఆయన చూపిన మార్గాన్ని యువతకు ప్రేరణగా భావిస్తూ, సమాజ నిర్మాణంలో అంబేద్కర్ ఆలోచనలు ఎంతో అవసరమని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa