హైదరాబాద్ - బీజాపూర్ రహదారిపై మొయినాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నగరం నుంచి మొయినాబాద్ వెళ్తున్న హోండా కారు యూటర్న్ తీసుకుంటుండగా, వెనుక నుంచి అతివేగంతో వచ్చిన షిఫ్ట్ కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు కానీ రెండు కార్లు దెబ్బతిన్నాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించగా, షిఫ్ట్ కారు డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడిపినట్లు తేలింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa