ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు ఎన్నికలు.. సర్పంచ్ అభ్యర్థికి గుండెపోటు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 13, 2025, 10:22 AM

TG: రేపు పంచాయతీ ఎన్నికలు జరగనున్న వేళ సర్పంచ్ అభ్యర్థికి గుండెపోటు రావడం కలకలం రేపింది. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం జంగరాయి గ్రామ సర్పంచ్ అభ్యర్థి సంజీవరెడ్డికి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు.  ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన నెలకొంది. కాగా, గ్రామంలో రేపు పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఘటన జరగడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa