నాగర్ కర్నూల్ జిల్లా ఊరుకొండ మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో, మండల అధ్యక్షులు కే రాజేందర్ గౌడ్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచులు, డిప్యూటీ సర్పంచులు, వార్డు మెంబర్లకు ఘనంగా సన్మానం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన బీజేపీ రాష్ట్ర నాయకులు ముచ్చర్ల జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజల్లో ఉంటూ పార్టీని బలోపేతం చేసిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ ముచ్చర్ల లక్ష్మారెడ్డి, నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa