కేశంపేట మండలం లింగందన గ్రామంలో నాగిళ్ల విష్ణు అనే రైతుకు చెందిన వ్యవసాయ పొలంలో ఉన్న గడ్డి వామును గుర్తు తెలియని వ్యక్తులు కావాలనే దగ్ధం చేశారు. ఈ ఘటనలో సుమారు 80 శాతం గడ్డి వాము కాలిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి, రైతుకు భారీ నష్టం కలిగించే ఈ చర్యపై కేసు నమోదు చేశారు. దగ్ధానికి పాల్పడిన నిందితులను గుర్తించి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa