తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు ముగియడంతో, పరిషత్ (MPTC, జడ్పీ) ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం, ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. అధికారులు ఈ ఫైల్‌ను సీఎంకు పంపారు. రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపాదించారు. పంచాయతీ ఎన్నికల తరహాలోనే రిజర్వేషన్లు ఖరారు చేశారు. సీఎం ఆమోదం లభిస్తే, ఈ నెల 25లోపు షెడ్యూల్ విడుదల చేసి, జనవరిలో ఎన్నికలు పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa