వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం సంగినేనిపల్లి గ్రామ పంచాయతీలో జరిగిన ఎన్నికల్లో 2,559 ఓట్లకు గాను 2,216 ఓట్లు పోలయ్యాయి. 86.6% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. గ్రామంలోని 10 వార్డులలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది, సాయంత్రంలోగా సర్పంచ్ ఎన్నికల తుది ఫలితాలు వెలువడతాయని అధికారులు పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa