కొందుర్గు మండలం లక్ష్మీదేవిపల్లి సర్పంచ్ మంచాల అనూష దామోదర్, ఉపసర్పంచ్ వెంకటేష్ గౌడ్, 8 మంది వార్డు సభ్యులు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. గ్రామాభివృద్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని వారు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి అధికార పార్టీ చేతుల్లోనే ఉందని, కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఎమ్మెల్యే శంకర్ అన్నారు. తనను నమ్మిన సర్పంచులకు నిరంతరం అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa