TG: పంచాయతీ ఎన్నికల ఫలితాలను BRS చీఫ్ కేసీఆర్ విశ్లేషించారు. ఎన్నికల ఫలితాలు పార్టీకి సానుకూలంగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. MPTC, ZPTC, మున్సిపల్ ఎన్నికల్లో మరింత దూకుడుతో వెళ్లాలని పార్టీ సీనియర్లకు సూచించారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల బాధ్యతలను కేటీఆర్కు అప్పగించారు. అలాగే, MPTC, ZPTC ఎన్నికల సన్నద్ధతను సీనియర్ నేత హరీశ్ రావు పర్యవేక్షించనున్నారు. ఈ వ్యూహాలు రాబోయే ఎన్నికల్లో పార్టీ బలాన్ని పెంచే దిశగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa