జాతీయ ఉపాధి హామీ చట్టం స్థానంలో వీబీ జీ రామ్ జీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకురావడంపై విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తెలంగాణ మంత్రి సీతక్క ఈ అంశంపై మాట్లాడుతూఉపాధి హామీ చట్టానికి కేంద్రం మహాత్మా గాంధీ పేరును తీసేసి, ఆయనను మరోసారి హత్య చేసిందని అన్నారు. గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. అదానీ, అంబానీల మైనింగ్ తవ్వకాలకు కూలీలను సరఫరా చేసేందుకే ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేశారని సీతక్క మండిపడ్డారు. ఈ చట్టాన్ని రక్షించుకునే బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. ఉపాధి హామీ పథకాన్ని కాపాడాలని అన్ని గ్రామాల్లో తీర్మానాలు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని తెలిపారు. ఈ నెల 27 లేదా 28 తేదీలో ర్యాలీలు నిర్వహిస్తామని చెప్పారు. వెట్టి చాకిరీ నుంచి విముక్తి కల్పించేందుకు, వలసలను అరికట్టేందుకు గత యూపీఏ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని తీసుకొస్తే ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీకి ఉరి వేసిందని దుయ్యబట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa