తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని, దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 8 నుండి 10వ తేదీ వరకు 11 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ రైళ్లు కాకినాడ-వికారాబాద్, వికారాబాద్-పార్వతీపురం, పార్వతీపురం-వికారాబాద్, పార్వతీపురం-కాకినాడ టౌన్, సికింద్రాబాద్-పార్వతీపురం, కాకినాడ టౌన్-వికారాబాద్ మార్గాల్లో ప్రయాణిస్తాయి. ఈ ప్రత్యేక రైళ్లకు సంబంధించిన టికెట్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa