ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం: ఇద్దరు అరెస్ట్, MDMA స్వాధీనం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 16, 2026, 01:49 PM

హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో డ్రగ్స్, గంజాయి స్మగ్లర్లపై పోలీసుల ఉక్కుపాదం కొనసాగుతోంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలోని హసన్‌నగర్‌లో ఎస్ఓటీ పోలీసులు తనిఖీలు నిర్వహించి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి MDMA డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. A1 అన్వర్ హుస్సేన్, A2 బుర్ర సంపత్‌గా గుర్తించిన నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. డ్రగ్స్ ఎక్కడి నుంచి తెచ్చారు, ఎవరు సరఫరా చేశారు, గతంలో వీరి ప్రమేయం ఉందా అనే కోణంలో విచారణ జరుగుతోంది. ప్రాథమిక విచారణ అనంతరం ఇద్దరినీ రిమాండ్‌కు తరలించారు. హైదరాబాద్‌లో డ్రగ్స్ మాఫియాపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa