హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో నకిలీ టికెట్లతో ప్రయాణానికి వచ్చిన 8 మంది ప్రయాణికులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారిని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు పోలీసులకు అప్పగించారు. నకిలీ టికెట్లు ఎలా వచ్చాయి, దీని వెనుక ఏదైనా ముఠా ఉందా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa