ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఖమ్మంలో వైభవంగా గుంటు మల్లేశ్వరస్వామి కళ్యాణం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 17, 2026, 03:27 PM

ఖమ్మం నగరం 39 వ డివిజన్ ట్రంక్ రోడ్డులో గల గుంటుమల్లన్న స్వామి దేవాలయంలో శనివారం మాస శివరాత్రి సందర్భంగా గుంటు మల్లేశ్వరస్వామి కళ్యాణం అత్యంత వైభవోపేతంగా జరిగింది. ఆలయ అర్చకులు దాములూరి కృష్ణశర్మ ఆధ్వర్యంలో ఉదయం స్వామివారికి అన్నాభిషేకం, పంచామృతాభిషేకం నిర్వహించి, నీరాజనం, మంత్రపుష్పం సమర్పించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన స్వామివారి కళ్యాణం నవరసభరితంగా సాగింది. ఈ కార్యక్రమంలో దాములూరి శివాని, ఆలయ కార్యనిర్వహణాధికారి చుండూరు రామకోటేశ్వరరావు, భక్త బృంద సభ్యులు, ఆలయ అధికారులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa