ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఘనంగా శ్రీ సీతారామస్వామి కళ్యాణం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 19, 2026, 03:35 PM

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో మాఘ అమావాస్య సందర్భంగా చారిత్రాత్మక 'రాముల బండ'పై సోమవారం శ్రీ సీతారామస్వామి కళ్యాణం వైభవంగా జరిగింది. అర్చకులు వేదమంత్రాల మధ్య శాస్త్రోక్తంగా ఈ వేడుకను నిర్వహించారు. భక్తుల జై శ్రీరామ్ నినాదాలతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa