వనపర్తి పట్టణంలోని సీపీఐ కార్యాలయం వద్ద జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం జరిగింది. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యురాలు, మాజీ సర్పంచ్ కళావతమ్మ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీఐ వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ, భారతదేశం భిన్న మతాలు, సంస్కృతులకు నిలయమని, దేశ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన రాజ్యాంగాన్ని గౌరవించాలని, కాపాడుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు గోపాలకృష్ణ, పృథ్వినాదం, జయమ్మ, శిరీష, చిన్న కుర్మయ్య, వంశీ, రూప మహారాజ్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa