బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో ఈ నెల 28 నుంచి 31 వరకు జరిగే ఎయిర్ షోకు ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్నందున, ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేయనున్నట్లు తెలిపారు. ఉదయం 7 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు పంజాగుట్ట-గ్రీన్‌ల్యాండ్స్-బేగంపేట ఎయిర్‌పోర్ట్ మార్గంలో భారీ ట్రాఫిక్ ఉండే అవకాశం ఉందని, PNT ఫ్లైఓవర్, రసూల్‌పురా, సీటీవో జంక్షన్ల వద్ద రద్దీని తగ్గించడానికి తగిన మళ్లింపులు ఉంటాయని పేర్కొన్నారు. ఎయిర్ షోకు హాజరయ్యే వారి కోసం నిర్దేశిత పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు.వాహనదారులు పీక్ అవర్స్‌లో ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణించాలని ట్రాఫిక్ పోలీసులు కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa