పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించడమే లక్ష్యంగా కేంద్రం కొత్త పన్నుల నియమావళిని అమల్లోకి తెచ్చింది. ఇప్పటివరకు ఉన్న 28 శాతం జీఎస్‌టీ ప్లస్ కాంపెన్సేషన్ సెస్ స్థానంలో.. ఇప్పుడు 40 శాతం జీఎస్‌టీతో పాటు అదనపు ఎక్సైజ్ డ్యూటీ, హెల్త్ సెస్ విధిస్తున్నారు. దీనివల్ల సిగరెట్ల ధరలు 15 నుంచి 40 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది.సిగరెట్ పొడవు, ఫిల్టర్ రకాన్ని బట్టి పన్నులను ఖరారు చేశారు, 65 మి.మీ లోపు (నాన్-ఫిల్టర్) ఒక్కో సిగరెట్‌పై రూ. 2.05 అదనపు డ్యూటీ, 65 మి.మీ లోపు (ఫిల్టర్) ఒక్కో సిగరెట్‌పై రూ. 2.10 అదనపు డ్యూటీ, మీడియం (65-70 మి.మీ) ఒక్కో స్టిక్‌పై సుమారు రూ. 4 వరకు పెంచారు. అలాగే, ప్రీమియం/లాంగ్ (70-75 మి.మీ) ఒక్కో స్టిక్‌పై రూ. 5.40 వరకు భారం పడనుంది. కొన్ని కేటగిరీల్లో 1000 సిగరెట్లపై రూ. 8,500 నుంచి రూ. 11,000 వరకు ఎక్సైజ్ డ్యూటీ పడనుంది.పాన్ మసాలా, గుట్కా తయారీదారులు ఇకపై తమ ప్యాకింగ్ మెషీన్ల సామర్థ్యం ఆధారంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా, తయారీ కేంద్రాల్లో తప్పనిసరిగా CCTV కెమెరాలు, ఏర్పాటు చేసి ఆ ఫుటేజీని 24 నెలల పాటు భద్రపరచాలని ప్రభుత్వం ఆదేశించింది. పచ్చి పొగాకుపై 60-70 శాతం, ఈ-సిగరెట్లపై 100 శాతం పన్ను విధించడం ద్వారా ప్రభుత్వం తన కఠిన వైఖరిని స్పష్టం చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa