విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. ఈ ఘటన నల్గొండ జిల్లా చింతపల్లి మండల పరిధిలోని గోడుకొండ్ల వి.టి నగర్ ప్రాథమిక పాఠశాలలో జరిగింది. ఉపాధ్యాయుడు మద్యం సేవించి పాఠశాలకు రావడమే కాకుండా బాలికల పట్ల అనుచితంగా ప్రవర్తించడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో విద్యార్థినుల తల్లిదండ్రులు సదరు ఉపాధ్యాయుడిని చితకబాదారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa