ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మక్తా మహబూబ్‌పేట డివిజన్‌లో బీఆర్‌ఎస్‌లోకి భారీ చేరికలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 07, 2026, 04:05 PM

ఈరోజు శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మక్తా మహబూబ్‌పేట డివిజన్‌కు చెందిన బీజేపీ నాయకుడు శివరాజ్ ముదిరాజ్ అధికారికంగా  బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమం కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారి సమక్షంలో ఘనంగా జరిగింది.ఈ చేరికల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హాజరుకాగా, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు మారబోయిన రవి యాదవ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు శివరాజ్ ముదిరాజ్‌కు గులాబీ కండువా కప్పి బీఆర్‌ఎస్ పార్టీలోకి హృదయపూర్వకంగా ఆహ్వానించారు. శివరాజ్ ముదిరాజ్‌తో పాటు పలువురు కార్యకర్తలు కూడా బీఆర్‌ఎస్‌లో చేరడం విశేషం.ఈ కార్యక్రమంలో రోజా, గోపిరాజు శ్రీనివాస్, బి.ఎస్.ఎన్ కిరణ్, చందానగర్ మాజీ కార్పొరేటర్ నవతా రెడ్డి, మల్లా రెడ్డి,  చందానగర్ శ్రీకాంత్, హైదర్ నగర్ డివిజన్ శుభరాజు, మాధాపూర్ డివిజన్ శ్రీనివాస్ గౌడ్, కొండాపూర్ డివిజన్ అల్లౌద్దీన్ పటేల్, నరేంద్ర, సంతోష్ కుమార్‌తో పాటు శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన పెద్ద సంఖ్యలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో వెంకట్ రెడ్డి, సాయి నందన్ ముదిరాజ్, నవీన్ గౌడ్, మున్నా, సత్యనారాయణ గౌడ్, గోపిరాజ్, బాలరాజ్, శివాజీ, కృష్ణ కె., రాజు చారి, గణేష్, సురేష్, శ్రీకాంత్ యాదవ్, మాజిద్, రాంబాబు, రజ్జాక్, జాకీర్, మస్తాన్,  సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు .






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa