ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళా ఫిజియోథెరపీస్ట్‌ ఆత్మహత్య

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 07, 2026, 07:43 PM

TG: మహిళా ఫిజియోథెరపీస్ట్‌ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన HYD సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కుత్బుల్లాపూర్ సాయిబాబా నగర్‎లో నివాసముండే బత్తిని అనిత (29) మల్లారెడ్డి హాస్పిటల్‎లో ఫిజియోథెరపి డాక్టర్‎గా పని చేస్తోంది. అయితే శనివారం ఉదయం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్‎కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తెల్లవారుజామున అనిత ఉరికి వేలాడుతుండడాన్ని  గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అనిత మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సూరారం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా ఆత్మహత్య కు గల కారణాలు తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa