ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకున్న సీఎం రేవంత్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 08, 2026, 06:29 PM

జయశంకర్ భూపాలపల్లి జిల్లా, రేగొండ మండలం, కొడవటంచ గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకుని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి గారి రాక సందర్భంగా అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం ఆశీర్వచనం అందించారు.దేవాలయ అతిథి గృహంతో పాటు ఇతర అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. దేవాలయ ప్రాంగణంలో మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారితో పాటు మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, కొండా సురేఖ గారు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు గారు  పాల్గొన్నారు


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa